- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముతావళిని తొలగించి మసీదును కాపాడాలి..
మసీదు, స్మశాన వాటిక భూములను అక్రమ కబ్జాల నుంచి కాపాడాలని, ప్రస్తుత ముతావళిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా దిండి గ్రామస్తులు సోమవారం నాంపల్లిలోని హజ్ హౌస్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

దిశ, కార్వాన్ : మసీదు, స్మశాన వాటిక భూములను అక్రమ కబ్జాల నుంచి కాపాడాలని, ప్రస్తుత ముతావళిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా దిండి గ్రామస్తులు సోమవారం నాంపల్లిలోని హజ్ హౌస్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం దిండి గ్రామానికి చెందిన ఖాద్రియ మసీదు ముతావలి (పర్యవేక్షకుడు) హుస్సేన్ ఖాద్రి తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఆయనను ముతావలిగా నియమించినప్పటి నుంచి మసీదుతో పాటు స్మశాన వాటిక భూములను కబ్జా చేసి, అవి తన సొంత ఆస్తులన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
స్థానికులను మసీదులోకి రానివ్వకుండా, నమాజ్ చేసుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మసీదుకు వచ్చే ఆదాయాన్ని, నిధులను తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ అన్యాయాల పై ఎవరైనా ప్రశ్నిస్తే వారి పై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. గత 15 ఏళ్లుగా ఈ సమస్య పై మేము పోరాటం చేస్తున్నాం. వక్ఫ్ బోర్డు చైర్మన్, సీఈఓలను పలుమార్లు కలిసి వినతి పత్రాలు సమర్పించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. వక్ఫ్ బోర్డు అధికారులు స్పందించి హుస్సేన్ ఖాద్రిని వెంటనే ముతావలి పదవి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కలీం, ఖయ్యూం, జవర్, ఉమర్, నిరంజన్, పీర్ మహమ్మద్, రషీద్, షౌకత్, సద్దాం చాంద్‌లతో పాటు గ్రామానికి చెందిన మహిళలు, పిల్లలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






