- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై యువకుడి దాడి
ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ పై ఓ యువకుడు దాడి చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ పై ఓ యువకుడు దాడి చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సు డ్రైవర్ సురేశ్, కండక్టర్ లీలా ప్రసాద్ పై ఈ దాడి జరిగింది. బస్సుకోసం స్టాప్ లో ఎదురుచూస్తుండగా.. డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో.. ఓ యువకుడు ఆగ్రహానికి గురయ్యాడు. బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో.. బైక్ తో వెంబడించి.. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద బస్సును అడ్డగించి.. ఇద్దరిపైనా దాడికి పాల్పడ్డాడు. బస్సులో ఖాళీ లేకపోవడంతోనే ఆపలేదని తోటి ప్రయాణికులు నచ్చజెప్పినా ఆ యువకుడు వినలేదు. సర్దిచెప్పే ప్రయత్నం చేసిన ప్రయాణికులను కూడా అసభ్యంగా దూషించారు. ఈ ఘటనతో కరకట్ట రూటులో గంటసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. దాడిచేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. డ్రైవర్ కంప్లైంట్ తో యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






