‘కొరియన్ కనకరాజు’ నుంచి మాస్ సాంగ్ విడుదల.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

by Mallepaka Hamsa |

మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ మాస్ ఫోక్ సాంగ్ వింటుంటేనే ఊపు తెప్పించేలా ఉంది.

‘కొరియన్ కనకరాజు’ నుంచి మాస్ సాంగ్ విడుదల.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ సూపర్ టాక్‌ను దక్కించుకున్నాయి. ఈ జోష్‌ను ఇలాగే కొనసాగిస్తూ.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ ‘రాసా గుమ్మాడి’ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ మాస్ ఫోక్ సాంగ్ వింటుంటేనే ఊపు తెప్పించేలా ఉంది. ఈ పాటకు నల్గొండ గద్దరు అందించిన మాస్ వాయిస్, ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ రాసిన పక్కా లోకల్ సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సాంగ్‌లో వరుణ్ తేజ్ ఎనర్జీ, ఆయన మాస్ లుక్ థియేటర్లలో ఆడియన్స్‌తో ఈలలు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఈ పాటలో దక్ష నగార్కర్ గ్లామరస్ ప్రజెన్స్, వరుణ్ తేజ్‌తో ఆమెకున్న స్క్రీన్ కెమిస్ట్రీ సాంగ్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేసింది. ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను చిత్రబృందం అనంతపురంలో చాలా గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ‘కొరియన్ కనకరాజు’ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అనంతపురం పరిసర ప్రాంతాల్లోనే జరిగిందని, అందుకే ఈ స్పెషల్ మాస్ సాంగ్‌ను కూడా అక్కడి ప్రజల మధ్యే రిలీజ్ చేయాలని చిత్రబృందం ముందే ప్లాన్ చేసుకుందని చెప్పారు. అనుకున్నట్లుగానే అనంతపురంలో ఈ పాటను విడుదల చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఈ మాస్ ఫోక్ సాంగ్ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని వరుణ్ తేజ్ అన్నారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తూ భారీ వ్యూస్‌ను రాబట్టుకుంటోంది.



Next Story