- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవరైనా తెలిసి తెలిసి మునిగే పడవను ఎక్కుతాడా?.. మల్లారెడ్డి పార్టీ మార్పు ప్రచారం వేళ KTR హాట్ కామెంట్స్
కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి తిట్లు, ఒట్లు తప్ప ఏమీ చేతకాదని మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. గత కొంత కాలంగా గులాబీ పార్టీకి అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మల్లారెడ్డి కండువా మార్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని శ్రావణమాసంలో ఆయన కారుదిగడం ఖాయం అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే మల్లారెడ్డి బీజేపీలో చేరబోతున్నారని కొందరు, కాంగ్రెస్‍లో చేరుతారని మరికొందరు అంచనాలు వేస్తున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇవాళతెలంగాణ భవన్‍లో పలువురు బాన్సువాడ నియోజకవర్గ నేతలు బీఆర్ఎస్‍లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ గతంలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‍లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. 'గాచారం బాగోలేకే పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎవరైనా తెలిసి తెలిసి మునిగే పడవను ఎక్కుతారా?. ఊడిపోయే కాంగ్రెస్‌లో చేరి.. నేను కాంగ్రెస్‌లోనే పుట్టినా అని డైలాగులు కొట్టి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగి గిలగిలా కొట్టుకుంటున్నాడు. స్పీకర్‍గా పని చేసిన పెద్ద మనిషి ఇప్పుడు తానే పార్టీలో ఉన్నానో చెప్పుకోలేని పరిస్థితి దాపురించింది' అని విమర్శించారు. అయితే ేమల్లారెడ్డి బీఆర్ఎస్ మారపోతున్నారనే ప్రచారం వేళ.. గతంలో బీార్ఎస్ ను వీడిన వారి పరిస్థితి ఎలా ఉందో వివరించడం పొలిటికల్ సర్కిల్‍లో హాట్ టాపిక్ అవుతోంది.
రేవంత్ రెడ్డికి ఆ రెండే వచ్చు:
ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడించడం, కాంగ్రెస్‍ను బొంద పెట్టడమే లక్ష్యంగా పని చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోచారం శ్రీనివాస్ తెలంగాణ తిరుమల యాదగిరిగి గుట్ట సాక్షిగా మాట ఇచ్చి తప్పాడని, ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ తోనే ఉంటానని దేవుడి మీద ఒట్టేసి చెప్పిన పోచారం మాట తప్పాడని అన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కరే దేవుడి మీద ఓట్లు పెట్టి మాట తప్పుతాడనుకున్నాం. కానీ పోచారం కూడా అదే దారి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తిట్లు, ఒట్లు ఈ రెండే వచ్చని ఈ రెండున్నరేళ్ల కాలంలో ఆయనేం చేశారో ఓ నాలుగు పనులు చెప్పగలడా అని ప్రశ్నించారు. ఊరికో దెవుడి మీద ఒట్టు పెట్టింది చాలదన్నట్లు మళ్లీ భద్రాచలం రాముడి మీద ఆనా అని ఒట్టు పెడుతున్నాడు. ఇప్పటి వరకు పెట్టిన ఒట్లు సరిపోవా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడపదాడటం లేదన్నారు. షాప్‍లలో లేని యూరియా యాప్‍లో ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఎన్నికలకు ఆరునెలల ముందు ఏదైనా కల్లిబొల్లి మాటలు చెబితే ప్రజలు మళ్లీ మాకే ఓటు వేస్తారనే భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ మాటలు నమ్మే పరిస్థితి మళ్లీ లేదన్నారు.






