గ్లామర్ డోస్ పెంచిన అవికా గోర్.. షర్ట్ బటన్స్ విప్పేసి రెచ్చిపోయింది

by Pulgam srinivas |

వైట్ షర్ట్‌లో హాట్ ట్రీట్.. అవికా గోర్ గ్లామర్ షో.

గ్లామర్ డోస్ పెంచిన అవికా గోర్.. షర్ట్ బటన్స్ విప్పేసి రెచ్చిపోయింది
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యంగ్ బ్యూటీ అవికా గోర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టెలివిజన్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ, అనంతరం సినిమాల్లోకి అడుగుపెట్టింది.




'ఉయ్యాల జంపాల' చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అవికా, తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుని ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆ తర్వాత వరుసగా పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు భారీ అభిమాన వర్గాన్ని కూడా సంపాదించుకుంది.




ఇటీవల నందు ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'అగ్లీ స్టోరీ' చిత్రంలో హీరోయిన్‌గా కనిపించిన అవికా గోర్‌కు ఈ సినిమా కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని అందించకపోయినా, నటిగా మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి.




ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజా ఫోటోల్లో అవికా గోర్ వైట్ కలర్ షర్ట్ ధరించి స్టైలిష్ లుక్‌లో మెరిసింది. ట్రెండీ స్టైలింగ్‌తో, కాన్ఫిడెంట్ పోజులతో కెమెరా ముందుకు వచ్చిన ఆమె గ్లామర్ టచ్‌తో ఆకట్టుకుంది.




విభిన్న యాంగిల్స్‌లో ఇచ్చిన పోజులు ఈ ఫోటోషూట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల నుంచి భారీ స్పందనను అందుకుంటున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story