‘దీన్ని రాజకీయం చేయకండి.. విద్యార్థుల కోసమే వచ్చా’.. జంతర్ మంతర్ ఆందోళనలో బాలీవుడ్ నటి!

by Ramesh Naini |   (  Updated:2026-07-19 12:29:23  IST  )

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్’ పరీక్ష అవకతవకలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో బాలీవుడ్ నటి పాల్గొన్నారు.

‘దీన్ని రాజకీయం చేయకండి.. విద్యార్థుల కోసమే వచ్చా’.. జంతర్ మంతర్ ఆందోళనలో బాలీవుడ్ నటి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్’ (NEET) పరీక్ష అవకతవకలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో బాలీవుడ్ నటి పూనమ్ పాండే పాల్గొన్నారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలో ఆదివారం (జులై 19) ఆమె విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ఈ సున్నితమైన సమస్యను ఎవరూ రాజకీయం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల పక్షానే నా పోరాటం..

ఆందోళనలో పూనమ్ పాండే మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను కేవలం విద్యార్థులకు మద్దతుగా ఇక్కడికి వచ్చాను. నాకు రాజకీయాలు తెలియవు. ఈ వివాదాల వల్ల ప్రాణాలు తీసుకున్న (ఆత్మహత్య చేసుకున్న) పిల్లల కోసమే నా ఈ పోరాటం. దయచేసి దీన్ని రాజకీయ, మతపరమైన అంశంగా మార్చకండి. ఎంతో మంది పిల్లలు చనిపోయారు.. విద్యార్థుల సమస్యపైనే మన దృష్టి పెడదాం’ అని స్పష్టం చేశారు.

వాంగ్‌చుక్ నిరాహార దీక్ష..

నీట్ అవకతవకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 21 రోజుల దీక్షతో దాదాపు 10 కిలోల బరువు తగ్గిన వాంగ్‌చుక్‌ను జూలై 18న ఢిల్లీ పోలీసులు బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించడాన్ని సీజేపీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే తీవ్రంగా తప్పుబట్టారు. ఇది పోలీసుల అతిపెద్ద తప్పిదమని, వారు వాంగ్‌చుక్‌ను కిడ్నాప్ చేశారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

సోనమ్ వాంగ్‌చుక్ భార్య కీలక నిర్ణయం.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు

Next Story