రెండేళ్లలో రాజ్యసభ ఎంపీల ఖర్చు రూ. 262 కోట్లు.. ఆర్టీఐలో షాకింగ్ విషయాలు

by Prasad Jukanti |   (  Updated:2026-07-19 12:28:25  IST  )

గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాజ్యసభ ఎంపీల జీతాలు, అలవెన్సులు మరియు ప్రయాణాల కోసం రూ. 262 కోట్లకు పైగా ఖర్చయినట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.

రెండేళ్లలో రాజ్యసభ ఎంపీల ఖర్చు రూ. 262 కోట్లు.. ఆర్టీఐలో షాకింగ్ విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2024-25, 2025-26) రాజ్యసభ ఎంపీల జీతభత్యాలు, ప్రయాణాలు, ఇతర వసతుల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 262 కోట్లకు పైగా ఖర్చయినట్లు ఆర్టీఐ (RTI) సమాధానం ద్వారా వెల్లడైంది. ఇందులో కేవలం వారి అలవెన్సులు, ప్రయాణాల కోసమే రూ. 151 కోట్లకు పైగా వ్యయం చేయడం గమనార్హం. చందర్ శేఖర్ గౌర్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు రాజ్యసభ సెక్రటేరియట్ ఇచ్చిన సమాధానంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

ఏడాదికేడాది పెరిగిన ఖర్చు:

2024-25 ఆర్థిక సంవత్సరం రాజ్యసభ సభ్యుల కోసం ప్రభుత్వం రూ.98 కోట్లకు పైగా ఖర్చు చేయగా ఈ ఖర్చు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.163 కోట్లకు పెరిగిందని వెల్లడైంది. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే ఎంపీల ఖర్చు రూ. 65 కోట్లు పెరగడం విశేషం. ఇక 2024-25 లో జీతాల కోసం రూ. 25.71 కోట్లకు పైగా ఖర్చు పెట్టగా అలవెన్సుల కోసం రూ. 33.33 కోట్లు, ప్రయాణ ఖర్చులు (టూర్స్) కోసం రూ. 24.99 కోట్లు, వైద్య బిల్లుల కోసం రూ.8.2 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీతాలు కోసం రూ. 44.6 కోట్లు, అలవెన్సుల కోసం రూ. 58.78 కోట్లు, ప్రయాణ ఖర్చులు (టూర్స్) రూ. 36 కోట్లు, వైద్య బిల్లులు: రూ. 9.6 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు.

21 విభాగాల కింద వసతులు:

కాగా, రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన వారికి మొత్తం 21 విభాగాల కింద నిధులు కేటాయిస్తారు. ఇందులో ప్రధానంగా జీతాలు, దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు, వైద్య బిల్లులు, కార్యాలయ ఖర్చులతో పాటు ప్రింటింగ్ మరియు పబ్లికేషన్స్, డిజిటల్ పరికరాలు, ఇంధనం, ప్రొఫెషనల్ సర్వీసెస్, రిపేర్లు-మెయింటెనెన్స్, సబ్సిడీలు మరియు ఇతర రెవెన్యూ ఖర్చులు ఉంటాయి.

‘దీన్ని రాజకీయం చేయకండి.. విద్యార్థుల కోసమే వచ్చా’.. జంతర్ మంతర్ ఆందోళనలో బాలీవుడ్ నటి!

Next Story