- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈటల, బండి సంజయ్ కలిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా.. రాజాసింగ్ హాట్ కామెంట్స్
ఈటల, బండి సంజయ్ కలిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా అని రాజాసింగ్ ప్రశ్న.. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు చేతులు కట్టేసి పనిచేయమనడంపై ఆగ్రహం!

దిశ, వెబ్ డెస్క్: వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) నిత్యం పార్టీలోని అంశాలను ఎండగడుతూ ఉన్నారు. ఈ క్రమంలో తాజా రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీలోని ఎంపీ ఈటల రాజేందర్, బండి సంజయ్ కలిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా అంటూ పార్టీ అధిష్టానాన్ని ఆయన ప్రశ్నించారు. అలాగే పార్టీలోని సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా రాజాసింగ్ ప్రశ్నించారు. ఇక త్వరలో జరబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల అంశంపై మాట్లాడుతూ.. మూడు కార్పొరేషన్‌ల మేయర్లను గెలవడం కాదు.. ముందు ఒక కార్పొరేషన్‌లో సంగం కార్పోరేటర్లను గెలిచి చూపించాలని ఈ సందర్భంగా రాజా సింగ్ సూచించారు. అలాగే పార్టీ ఒక వ్యక్తి కోసమే పని చేయడం మంచిది కాదని, అధ్యక్షుడు రాంచందర్ రావు చేతులు కట్టేసి పని చేయమంటే ఎలా అంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ అధిష్ఠానానికి ప్రశ్నల వర్షం కురిపించారు.






