తక్కువ వర్షపాతం.. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు

by Jakkula.Mamatha |

మండల పరిధిలోని ఉందెకోడ్ గ్రామంలోని రైతు వేదికలో ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన అగ్రికల్చర్ ఏఈఓ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

తక్కువ వర్షపాతం.. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు
X

దిశ,నర్వ: మండల పరిధిలోని ఉందెకోడ్ గ్రామంలోని రైతు వేదికలో ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన అగ్రికల్చర్ ఏఈఓ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎల్‌నినోవాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున, రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకొని నష్టాలను నివారించాలనే ఉద్దేశ్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉందెకోడ్ రైతు వేదికలో ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి జైన్ సింగ్ మాట్లాడుతూ.. తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, కంది, పెసర, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా రైతులు పంట నష్టాలు తగ్గించుకుని మెరుగైన ఆదాయం పొందవచ్చని రైతులకు తెలియజేశారు. అలాగే ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలు వినియోగించి, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ, తేమ సంరక్షణ, నేల పరీక్షల ఆధారంగా ఎరువులను వినియోగించుకోవాలని తెలిపారు. మరియు సమయానుకూలంగా పంటల సంరక్షణ చర్యల పై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ అందిస్తున్న సాంకేతిక సలహాలు, ప్రభుత్వ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ జైన్ సింగ్, ఏఈఓలు, ఉందెకోడ్ గ్రామ సర్పంచ్ జగన్నాథం, ఉప సర్పంచ్ రాజు, గ్రామ పెద్దలు రైతులు పాల్గొన్నారు.

Next Story