- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శర్వానంద్‌తో నెక్స్ట్ మూవీ ప్లాన్ చేసిన 'నాగబంధం' దర్శక–నిర్మాతలు
'నాగబంధం' దర్శక–నిర్మాతలు తమ తదుపరి చిత్రాన్ని శర్వానంద్‌తో చేయనున్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్'. ఈ చిత్రానికి అభిషేక్ నామ దర్శకత్వం వహించగా, ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు. భారీ అంచనాల నడుమ జూలై 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమై, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఇక ఈ సినిమా దర్శకుడు, నిర్మాతలు ఇప్పటికే ఓ క్రేజీ హీరోతో తమ తదుపరి ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో శర్వానంద్‌తో సినిమా చేసేందుకు వారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే శర్వానంద్‌తో చర్చలు కూడా జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకూలంగా జరిగితే, త్వరలోనే శర్వానంద్‌తో ఈ దర్శక–నిర్మాతల కొత్త ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.






