- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశాంత్ నీల్ మద్దతతో వస్తున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. ‘418’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
అంతేకాకుండా ఓ అమ్మాయి జుట్టు వీరబోసుకుని చీకటిలో కూర్చుని ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు.

దిశ, సినిమా: భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలు, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లతో టాలీవుడ్‌లో తిరుగులేని బ్యానర్‌గా దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఈసారి సరికొత్త జోనర్‌తో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. వారు నిర్మిస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘418’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, షూటింగ్ కంప్లీట్ గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ‘418’ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఈ అప్‌డేట్ ఇస్తూ.. ‘ఈ తలుపు వెనుక మీ భయాలన్నింటికీ ఆరంభం ఉంది..’ అంటూ ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను కూడా జత చేశారు. అంతేకాకుండా ఓ అమ్మాయి జుట్టు వీరబోసుకుని చీకటిలో కూర్చుని ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు.
ఇది సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇక ఈ చిత్రంలో సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి పగడాల ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఆమెతో పాటు చరణ్ లక్కరాజు, సూర్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సినిమా అంతా ఉత్కంఠ రేపే థ్రిల్లర్ అంశాల చుట్టూనే సాగుతుందని చిత్ర బృందం నమ్మకంగా చెప్తోంది. ఈ చిత్రానికి కీర్తన్ నాడగౌడ కథ అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహించారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సపోర్ట్ అందించడం విశేషం. అయితే ఇది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రాబోతున్న మొట్టమొదటి హారర్ థ్రిల్లర్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






