ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి.. విన్నర్స్‌కు మెడల్స్‌తో పాటు రింగ్స్

by Kema Shiva Kumar |

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్‌ సరికొత్త చరిత్రను లిఖించబోతోంది.

ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి.. విన్నర్స్‌కు మెడల్స్‌తో పాటు రింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫుట్‌బాల్ హిస్టరీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) ఫైనల్ మ్యాచ్‌ వేళ ఒక సరికొత్త రికార్డు నమోదు కాబోతోంది. స్పెయిన్, అర్జెంటీనా జట్ల మధ్య జరగనున్న ఫైనల పోరులో ట్రోఫీని గెలిచే జట్టుకు మెడల్స్‌తో పాటు స్పెషల్‌గా ‘చాంపియన్‌షిప్ రింగ్స్’ (Championship Rings) బహుకరించనున్నారు. ఫిఫా చరిత్రలో విజేతలకు ఇలాంటి ఉంగరాలను అందించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సాధారణంగా అమెరికన్ క్రీడలైన ఎన్ఎఫ్ఎల్ (NFL), ఎన్‌బీఏ (NBA), మేజర్ లీగ్ బేస్ బాల్ (MLB) వంటి పోటీలలో టైటిల్ గెలిచిన జట్లకు ఇలాంటి ప్రత్యేక చాంపియన్‌షిప్ రింగ్స్ ఇచ్చే సాంప్రదాయం ఉంది. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు కూడా పరిచయం చేస్తున్నారు.

కాగా, 2026 వరల్డ్ కప్‌ను గుర్తుచేస్తూ కేవలం 2,026 ఉంగరాలను మాత్రమే ఫిఫా ప్రత్యేకంగా తయారు చేయించింది. వాటిలో 30 ఉంగరాలను ఫైనల్‌లో గెలిచిన జట్టులోని ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ కోసం కేటాయించారు. మిగిలిన 1,996 ఉంగరాలను ఫిఫా అఫీషియల్ లైసెన్స్‌డ్ ప్రొడక్ట్స్‌ (FIFA Officially Licensed Products)గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల కోసం విక్రయానికి ఉంచనున్నారు. ప్రతి ఉంగరానికి ఒకవైపు ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ లోగో ఉంటుంది. మరోవైపు విజేతగా నిలిచిన జట్టుకు సంబంధించిన లోగో లేదా ఐడెంటిటీని ప్రింట్ చేశారు. తేకాకుండా ప్రతి రింగ్‌కు ఓ ప్రత్యేకమైన నంబర్, అది అసలైందేనని ధృవీకరించే సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే జరిగే వేడుకల్లో గెలిచిన జట్టు కెప్టెన్, హెడ్ కోచ్‌లకు తాత్కాలికంగా ఈ రింగ్స్ తొడుగుతారు. ఆ తర్వాత ఆటగాళ్ల వేలి కొలతలకు తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసి, ప్రత్యేక అధికారిక వేడుకలో మొత్తం 30 ఉంగరాలను జట్టుకు అందజేస్తారు.

Next Story