- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులపై దాడి.. బహదూర్‌గూడా భూ వివాదంలో రైతులపై కేసు నమోదు
శంషాబాద్ బహదూర్‌గూడలో బుల్లెట్ రైలు భూసేకరణ ఉద్రిక్తత.. డీసీపీ, సీఐలపై దాడి చేసిన రైతులపై తీవ్ర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు!

దిశ, వెబ్ డెస్క్: బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. శనివారం బహదూర్‌గూడాలోని రైతులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తులు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న అధికారులు, పోలీసులపై తిరగబడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. బుల్లెట్ ట్రైన్ కోసం 600 ఎకరాల భూసేకరణ విషయంలో పోలీసులకు రైతులకు మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రైతులు పోలీసులపై కారం చల్లి రాళ్లు, కుర్చీలు విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో డీసీపీ యోగేష్ గౌతమ్ సహా పలువురు సీఐలకు గాయాలు అయ్యాయి. శంషాబాద్‌లో శనివారం ఉదయం నుండి రైతుల ఆందోళన కొనసాగించారు.
బుల్లెట్ ట్రైన్ కోసం తమ భూములు ఇవ్వబోమని ఆదివారం కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అప్రమత్తం అయిన పోలీసులు బహదూర్‌గూడాలో హై అలర్ట్ ప్రకటించారు. అలాగే శనివారం పోలీసులపై దాడి చేసిన రైతులపై కేసు నమోదు చేశారు. పోలీసులపై రైతులు దాడులు చేశారని ఎస్సై వనజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు BNS 132, 308(2), 121(1)R/W 3(5) సెక్షన్ల కింద శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిన్న దాడికి సంబంధించిన వీడియోలను పరిశీలించిన తర్వాత దాడి చేసిన వారిని గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం కనిపిస్తుంది.






