కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి..

by Kodari Anjali |

కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇస్తే కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడటంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.

కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి..
X

దిశ, కార్వాన్: కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇస్తే కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడటంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవని సతీష్ మాదిగ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లతో తాము గంగా ఉన్నామని కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని సవాలు విసిరారు. ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ లు ఇచ్చి పరీక్ష పేపర్లు లీక్ చేసిన విషయాన్ని యావత్ సమాజం మర్చిపోలేదని గుర్తు చేశారు. 2024లో ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 563 గ్రూప్ వన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా దానిని కూడా విఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేయగా హైకోర్టు మొట్టికాయలు వేసిందని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణను పాలించి ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రజా ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే అడుగడుగునా అడ్డుపడడంపై మండిపడ్డారు. డిసెంబర్ ఏడో తారీఖున ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని నాటి నుంచి నేటి వరకు వివిధ శాఖలలో నోటిఫికేషన్లు ఇస్తూ 30 వేల నుంచి 70 వేల వరకు ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఈ విషయంలో ఎక్కడ చర్చకు రమ్మన్న తాము సిద్ధమని కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు.

Next Story