- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుణ్ తేజ్ కాలికి గాయం.. చేతి కర్రతో కనిపించడంతో ఆందోళనలో మెగా ఫ్యాన్స్
వరుణ్ తేజ్ చేతిలో కర్ర పట్టుకుని నడుస్తూ వేదికపైకి రావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్‌కు గత కొద్ది కాలంగా అదృష్టం కలిసిరావడం లేదు. ఆయన వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ పడటం లేదు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ ఆశలన్నీ ‘కొరియన్ కనకరాజు’పై పెట్టుకున్నారు. విభిన్నమైన కథలను తెరకెక్కించే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ క్రేజీ చిత్రాన్ని ఆగస్టు 7న థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచారు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా ఈ సినిమా మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేసి మొదటి పాటను విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ జోష్‌తోనే చిత్రబృందం తాజాగా, రెండో పాట విడుదల కార్యక్రమాన్ని అనంతపురంలో చాలా గ్రాండ్‌గా నిర్వహించింది.
అయితే ఈ ఈవెంట్‌లో పాల్గొన్న వరుణ్ తేజ్ చేతిలో కర్ర పట్టుకుని నడుస్తూ వేదికపైకి రావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ తన కాలికి జరిగిన గాయం గురించి అసలు విషయం బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని, సినిమాలో పాటల కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తన కాలికి గాయం అయినట్లు వరుణ్ తేజ్ వెల్లడించారు. వరుణ్ తేజ్ కాలికి దెబ్బ తగిలిందని తెలియడంతో మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయం అయినప్పటికీ సినిమా ప్రమోషన్స్ కోసం అనంతపురం వరకు వచ్చి ఈవెంట్‌లో పాల్గొనడంపై ఆయన డెడికేషన్‌ను మెచ్చుకుంటున్నారు. హీరో వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు.






