- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో దోపిడీ దొంగల బీభత్సం.. కేజీకిపైగా బంగారు ఆభరణాల చోరీ
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ గుర్తు తెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో దోపిడీ దొంగలు భారీ చోరీకి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ (Jubilee Hills)లో వెలుగుచూసింది. రోడ్ నంబర్ 10లోని గురుకృప ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Gurukrupa Exports Private Limited) కార్యాలయంలో భద్రపరిచిన సుమారు 1,028 గ్రాములు అంటే కిలోకు పైగా విలువైన బంగారు ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన ఆభరణాల విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బాత్‌రూమ్ కిటికీ సైలెంట్‌గా బ్రేక్ చేసి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వ్యాపారికి చెందిన గురుకృప ఎక్స్‌పోర్ట్స్‌లో వజ్రాలు పొదిగే పని కోసం ఆభరణాలను తీసుకొచ్చి లాకర్‌లో భద్రపరిచారు. అందులో 7 బంగారు నెక్లెస్‌లతో పాటు 7 జతల చెవిపోగులు కూడా ఉన్నాయి. అయితే ఇవాళ ఉదయం సంస్థ ప్రతినిధులు లాకర్ తెరిచి చూడగా ఆభరణాలు కనిపించలేదు. కార్యాలయంలోని బాత్‌రూమ్ కిటికీ పగలగొట్టి ఉండటంతో, దుండగులు అక్కడి నుంచే లోపలికి వచ్చి చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు.
యాక్షన్‌లోకి పోలీసులు, క్లూస్ టీమ్
అయితే, ఈ చోరీపై సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తొలుత స్పాట్‌కు చేరుకున్ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కొన్ని ఆధారాలు సేకరించాయి. ముఖ్యంగా ఆఫీసులో ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీస్తున్నారు. ఈ దొంగతనం బయటవారు చేసిందా.. లేక ఆఫీసు సిబ్బంది ప్రమేయం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.






