రీ-రిలీజ్‌కు రెడీ అయిన 'ఖడ్గం'.. సూపర్ తేదీ ఫిక్స్

by Pulgam srinivas |

ఖడ్గం చిత్రాన్ని ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రీ-రిలీజ్ చేయనున్నారు.

రీ-రిలీజ్‌కు రెడీ అయిన ఖడ్గం.. సూపర్ తేదీ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఖడ్గం'. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా 2002లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఎన్నోసార్లు బుల్లితెరపై ప్రసారమై విశేషమైన ఆదరణను పొందింది. ఇటీవలి కాలంలో అనేక సినిమాలు రీ-రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దేశభక్తి ప్రధాన చిత్రాన్ని కూడా రీ-రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రీ-రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల చేయడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ కానుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి రీ-రిలీజ్‌లో ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.





Next Story