రాజోలిలో విషాదం.. స్నేహితుడి ఇంటి వరండాలో వ్యక్తి ఆత్మహత్య

by Jakkula.Mamatha |

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.

రాజోలిలో విషాదం.. స్నేహితుడి ఇంటి వరండాలో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ,రాజోలి: జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన స్నేహితుడి ఇంటికి వచ్చిన అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన సత్యనారాయణ చాలా ఏళ్ల క్రితం రాజోలిలో నివసించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాయదుర్గంలో నివసిస్తున్న ఆయన ఆదివారం రాత్రి సుమారు 10 గంటలకు రాజోలికి చెందిన చేనేత కార్మికుడు గోపి ఇంటికి వచ్చినట్లు సమాచారం. తెల్లవారుజామున స్నేహితుడి ఇంటి బయట వరండాలో ఆరేసిన చీరలు పైన ఉన్న పైపులకు వేసి ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story