రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పని చేయను.. ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

అక్కడ తనకు ఎప్పుడూ రక్షణ ఉన్నట్లు అనిపించలేదని, నెగిటివ్ కామెంట్స్ వల్ల మనుషులతో మాట్లాడాలన్నా భయం వేసేదని అన్నారు.

రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పని  చేయను.. ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరోయిన్ ఐశ్వర్యలక్ష్మి ఇటీవల ‘గట్ట కుస్తీ 2’ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఐశ్వర్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా కలెక్షన్ల నంబర్ల కంటే థియేటర్లలో జనాలు నవ్వుతుంటే చూడటమే తనకు నిజమైన సంతోషాన్ని ఇచ్చిందని ఐశ్వర్య లక్ష్మి చెప్పారు. కామెడీ చేయడం తనకు కొత్త అని, ఇందులో ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. ఇక సోషల్ మీడియాకు దూరం కావడంపై ఐశ్వర్య మాట్లాడుతూ.. నెటిజన్ల ట్రోలింగ్, బాడీ షేమింగ్, ఫొటోలను మార్ఫింగ్ చేయడం వంటి కారణాల వల్ల తాను సోషల్ మీడియా అకౌంట్‌ను డిలీట్ చేసినట్లు చెప్పారు. అక్కడ తనకు ఎప్పుడూ రక్షణ ఉన్నట్లు అనిపించలేదని, నెగిటివ్ కామెంట్స్ వల్ల మనుషులతో మాట్లాడాలన్నా భయం వేసేదని అన్నారు.

ఇప్పుడు సోషల్ మీడియా లేకపోవడం వల్లే ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నానని.. ఎవరైనా రోజుకు రూ. 100 కోట్లు ఇస్తానన్నా మళ్లీ సోషల్ మీడియాలోకి రానని తేల్చి చెప్పారు. తన తదుపరి సినిమాల గురించి చెబుతూ.. ఐశ్వర్య ఆనంద్ దర్శకత్వంలో 1996 బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఒక తమిళ సినిమాలో లేడీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు తెలిపారు. ఇది రెగ్యులర్ మాస్ సినిమా కాదని, చాలా విభిన్నంగా ఉంటుందని అన్నారు. అలాగే మలయాళంలో ‘ఆశ’ అనే సినిమాతో పాటు ‘తీవినై పోట్రు’, ‘#లవ్’ అనే రెండు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నట్లు చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా తన బాలీవుడ్ ఎంట్రీ సినిమా పాత్ర చాలా అద్భుతంగా కుదిరిందని, ఆ క్యారెక్టర్ చేయడానికి తాను నిజంగా అర్హురాలినా అనే అనుమానం కూడా వచ్చిందని.. హిందీ ప్రేక్షకులు తన నటనను ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అమ్మడు షాకింగ్ నిర్ణయంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story