- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాచ్‌మేట్ కుటుంబానికి రూ.25 లక్షల అండ
సహచరుడి కుటుంబం కష్టాల్లో ఉందని తెలుసుకున్న 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు తమ ఐక్యత, మానవత్వాన్ని చాటుకున్నారు.

దిశ, సూర్యాపేట ప్రతినిధి/చిలుకూరు : సహచరుడి కుటుంబం కష్టాల్లో ఉందని తెలుసుకున్న 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు తమ ఐక్యత, మానవత్వాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్–తెలంగాణ 2014 బ్యాచ్ ఎస్సైల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 746 మంది ఎస్సైలు స్వచ్ఛందంగా విరాళాలు సమకూర్చి, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఎస్సై జి.వెంకటనారాయణ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన జి. వెంకటనారాయణ 2014లో ఎస్సైగా ఎంపికై కీసర పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించారు. క్యాన్సర్‌తో పోరాడుతూ ఈ ఏడాది మే 19న ఆయన మృతి చెందారు. ఆయన మరణంతో భార్య, ఇద్దరు కుమారులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మిగిలారు.
ఈ నేపథ్యంలో సహచరుడి కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించిన 746 మంది ఎస్సైలు కలిసి రూ.25 లక్షల నిధిని సమకూర్చారు. ఆదివారం బేతవోలు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మృతుడి ఇద్దరు కుమారులకు చెరో రూ.10 లక్షలు, తల్లిదండ్రులకు రూ.5 లక్షల చెక్కులను అందజేశారు. ఆంధ్రప్రదేశ్–తెలంగాణ 2014 బ్యాచ్ ఎస్సైల వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు టి. శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 50 మంది ఎస్సైలు హాజరై వెంకటనారాయణ కుటుంబానికి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా సహచరులు మాట్లాడుతూ.. ఉద్యోగ బంధం కేవలం విధులకే పరిమితం కాదని, కష్టసమయంలో ఒకరికొకరు అండగా నిలవడమే నిజమైన సహచర ధర్మమని పేర్కొన్నారు. 2014 బ్యాచ్ ఎస్సైలు చూపిన ఐక్యత, ఔదార్యం అందరికీ ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ తిరుపతి, ఎస్సైలు శ్రీకాంత్ గౌడ్, సుధాకర్, అశోక్ రెడ్డి, రామకృష్ణ, కోటేష్, నరేష్, ప్రవీణ్ కుమార్, నవీన్, ఇరుగురవి, మహేందర్ లాల్, దేవేందర్** తదితరులు పాల్గొన్నారు.






