- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది చారిత్రాత్మక విజయం.. పీవీ సింధు గెలుపుపై ప్రధాని ప్రశంసలు
జపాన్ ఓపెన్ 2026లో విజయం సాధించిన బ్యాట్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు గెలుపుపై ప్రధాని మోడీ ఎక్స్ వేధికగా ప్రశంలు కురిపించారు. భారత బ్యాడ్మింటన్‌కు ఇది చారిత్రాత్మక విజయం అని పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: జపాన్ ఓపెన్ 2026లో విజయం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు గెలుపుపై ప్రధాని మోడీ ఎక్స్ వేధికగా ప్రశంలు కురిపించారు. భారత బ్యాడ్మింటన్‌కు ఇది చారిత్రాత్మక విజయం అని పేర్కొన్నారు. టోర్నమెంట్ అంతటా ఆమె పట్టుదల, అసాధారణ నైపుణ్యాలు ప్రస్పుటంగా కనిపించాయన్నారు. ఈ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలు సింధు కావడం, ఈ ఘనతను మరింత ప్రత్యేకంగా నిలపుతుందని అభినందించారు. ఈ విజయం దేశంలోని యువ క్రీడాకారులు ఆటల్లో రాణించడానికి ప్రేరేపిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచిన సింధు ఈ టైటిల్ అందుకున్న తొలి భారత మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. ఫైనల్స్ లో జపాన్ ప్లేయర్ యమగూచిపై 21-17, 21-17 వరుస సెట్ల తేడాతో విజయం సాధించింది. 2020లో కామన్వెల్త్ గేమ్స్ లో సింధు పసిడి పతకం సాధించగా తరవాత ఎడమకాలి మడమ గాయం కారణంగా ఫామ్ కోల్పోయింది. అప్పటి నుండి తీవ్రఒడిదొడుకులు ఎదుర్కొంటూ తాజా విజయంతో మరోసారి సత్తా చాటింది. తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టు ప్రపంచానికి చాటిచెప్పింది.






