- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ సీఎం కోరికకు సీఎం గ్రీన్ సిగ్నల్..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తూ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్య అభ్యసించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో మధిర నియోజకవర్గ కేంద్రమైన మధిరలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం జరిగింది.

దిశ, మధిర: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తూ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యను అభ్యసించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో మధిర నియోజకవర్గ కేంద్రమైన మధిరలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం జరిగింది. మధిర నియోజకవర్గ కేంద్రానికి ఇంజనీరింగ్ కళాశాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల 18న ఇంజనీరింగ్ కళాశాల మంజూరు జీవో కాపీని జారీ చేశారు. మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం మోత్కుపల్లి క్రాస్ రోడ్ జగన్నాధపురం గ్రామంలో ఈ నెల 10న నిర్వహించిన రైతు ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్యాబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సభలో మధిర శాసనసభ్యులు డిప్యూటీ సీఎం ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం కేంద్రమైన మధిరలో ఇంజనీరింగ్ కళాశాల అవసరం ఉందని ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. డిప్యూటీ సీఎం కోరిక మేరకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ఆశీర్వాద సభలో ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడంతో మధిర నియోజకవర్గ ప్రాంతంలోనే విద్యార్థులకు ఉన్నత విద్యా విధానానికి కొత్త అవకాశాలతో పాటుగా మెరుగైన విద్యతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేయడంతో ఈ ప్రాంత ప్రజలకు సువర్ణవకాశం కల్పించి ప్రాంత అభివృద్ధికి ఒక బలమైన అడుగు పడింది. ఈ ప్రాంతంలోనే గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. మధిర నియోజకవర్గం లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కల నెరవేరడంతో పాటు ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారి ఆశయాలకు పునాది వేశారు.
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కులు ఆశీర్వాద సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తుందని, మధిరలో కళాశాల కోసం చేసిన విన్నపానికి తక్షణమే స్పందించి మధిర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి కృషి చేస్తానని, ప్రత్యేకించి విద్య వైద్య రంగాలు మౌలిక సదుపాయాల కల్పన పట్ల ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా డిప్యూటీ సీఎం ఈ ప్రాంత విద్యార్థులకు యువతకు ఉన్నత సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో ఇప్పటికే నూతనంగా అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్ ను , జవహర్ నాలెడ్జ్ సెంటర్ ను ఐటీ హబ్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలకు ఆమోదయోగ్యం లభించిన సంగతి తెలిసిందే అన్నారు.
ఇప్పటికే మధిరలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలతో పాటుగా డిప్లొమా వ్యవసాయ కళాశాల, పాలిటెక్నికల్ కళాశాల ఐటిఐ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ప్రాంతం విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసించేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన ప్రాంగణంలో డిప్లొమా వ్యవసాయ, పాలిటెక్నికల్ కళాశాలలు ఇప్పటికే సొంత భవనాలు హాస్టల్ వసతులు ఉన్నాయి. ఈ కళాశాలలో ఎంతో మంది విద్యార్థులు సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడంతో ఈ ప్రాంతం నుండి విద్యార్థులు హైదరాబాద్ చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లి సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు.
లక్షలు వెచ్చించి సాంకేతిక విద్యను అభ్యసించాలంటే అందరివల్ల సాధ్యం కావడం లేదు. పేద మధ్యతరగతి బడుగు బలహీనవర్గాల కుటుంబాల నుండి విద్యార్థులు ఫీజులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఇంటర్మీడియట్ విద్యతోనే ఆగిపోయి, తాము అనుకున్న ఉన్నత విద్యను అభ్యసించలేక ఉన్నత లక్ష్యాలను చేరుకోలేక ఆవేదన పడుతున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు ఇవ్వడంతో ఈ ప్రాంత విద్యార్థులకు యువతకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడంతో నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులు యువత ప్రత్యేకించి తల్లిదండ్రులు ఈ ప్రాంత విద్యావంతులు మేధావులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరతిగతిన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తీసుకొని రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.






