- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold and silver: బడ్జెట్ వేళ కుప్పకూలిన బంగారం వెండి ధరలు
ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం, వెండి ధరలు బడ్జెట్ వేళ అమాంతం కుప్పకూలాయి. ఊహించని రీతిలో ధరలు పతనమవ్వడంతో ఇన్వెస్టర్లు ఖంగుతిన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జెట్ స్పీడ్ తో పైపైకి దూసుకుపోయిన బంగారం (Gold Price), వెండి (Silver Price) ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వరుసగా మూడో రోజు వీటి ధరలు కుప్పుకూలాయి. కేంద్ర బడ్జెట్ వేళ దేశీయ కమొడిటీ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు 9 శాతం మేర పడిపోయాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో ఫ్యూచర్స్ (MCX Futures) ట్రేడింగ్ లో ఏప్రిల్ కాంట్రాక్ట్ బంగారం ధర ఆదివారం పతనమైంది. ఫ్యూచర్ ట్రేడింగ్స్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 13,711 క్షీణించి రూ. 1,38,634 కు చేరింది. ఇక వెండి ధర ఫ్యూచర్ ట్రేడింగ్స్ లో భారీగా పతనమైంది. మార్చి కాంట్రాక్ట్ వెండి ధర తగ్గుతుందని ఇన్వెస్టర్లు అంచనా వేయడంతో.. కిలోకు ఏకంగా రూ.26,273 (9శాతం) పతనమై రూ. 2,65,652 కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లోనూ ఇదే తగ్గుదల కనపిచింది. కామెక్స్ లో స్పాట్ బంగారం ధర ఔన్సుకు 4,879 డాలర్లు పలికింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లోల మూడు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Read More..






