ఈస్ట్ గోదావరిలోకి అడుగుపెడుతున్న దిల్ రాజు.. ఆ సినిమాతోనే ఆరంభం

by Pulgam srinivas |

'టాక్సిక్' చిత్రంతో ఈస్ట్ గోదావరిలోకి ఎంట్రీ ఇవ్వనున్న దిల్ రాజు.

ఈస్ట్ గోదావరిలోకి అడుగుపెడుతున్న దిల్ రాజు.. ఆ సినిమాతోనే ఆరంభం
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు తన సినీ ప్రయాణాన్ని మొదట డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభించారు. ఆ రంగంలో మంచి గుర్తింపు సంపాదించిన తర్వాత నిర్మాతగా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం నిర్మాతగా భారీ చిత్రాలను నిర్మిస్తూనే, డిస్ట్రిబ్యూటర్‌గా కూడా తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నైజాం, వైజాగ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాలను నిర్వహిస్తూ అనేక సినిమాలను విడుదల చేస్తున్న దిల్ రాజు, ఇప్పుడు మరో ప్రాంతంలో కూడా తన డిస్ట్రిబ్యూషన్ విస్తరణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

తాజా వార్తల ప్రకారం, 'టాక్సిక్' చిత్రానికి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే నైజాం, వైజాగ్‌తో పాటు ఈస్ట్ గోదావరిలో కూడా కొత్త డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. యశ్ ప్రధాన పాత్రలో నటించిన 'టాక్సిక్' చిత్రం ఆగస్టు 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రంతో ఆయన డిస్ట్రిబ్యూషన్ రంగంలో మరో విజయాన్ని అందుకుంటారో లేదో చూడాలి.

Next Story