- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'పొలిమేర 3'లో అర్జున్ సర్జా?
'మా ఊరి పొలిమేర 3'లో అర్జున్ సర్జా కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఎలాంటి అంచనాలు లేకుండా నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందిన చిత్రాల్లో 'మా ఊరి పొలిమేర' ఒకటి. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా విశేష ఆదరణ పొందడంతో దానికి కొనసాగింపుగా 'మా ఊరి పొలిమేర 2'ను రూపొందించి థియేటర్లలో విడుదల చేశారు. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం 'మా ఊరి పొలిమేర 3' నిర్మాణంలో ఉండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సీనియర్ స్టార్ నటుడు అర్జున్ సర్జ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ వంటి స్టార్ నటుడు బాగం అయితే ఈ సినిమాపై మరింత హైప్ ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






