కేంద్ర బడ్జెట్ వేళ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

by Malleboina Mahesh |   (  Updated:2026-02-01 05:04:36  IST  )

భారత పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మరికాసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో భారత స్టాక్ మార్కెట్లు ఆదివారం నాడు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

కేంద్ర బడ్జెట్ వేళ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్ డెస్క్: భారత పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మరికాసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో భారత స్టాక్ మార్కెట్లు ఆదివారం నాడు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాలతో సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బడ్జెట్ ప్రసంగానికి ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో మార్కెట్‌లో ఒడిదుడుకులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సాధారణంగా ఆదివారం సెలవు అయినప్పటికీ, బడ్జెట్ ప్రకటనలకు అనుగుణంగా ఇన్వెస్టర్లు స్పందించేందుకు వీలుగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నాయి. 1999 తర్వాత ఆదివారం నాడు మార్కెట్లు పనిచేయడం ఇది రెండోసారి మాత్రమే. నేటి ట్రేడింగ్‌కు సంబంధించి ఎక్స్ఛేంజీలు కొన్ని కీలక నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఈరోజు 'సెటిల్‌మెంట్ హాలిడే' కావడంతో, గత శుక్రవారం (జనవరి 30) కొనుగోలు చేసిన షేర్లను ఈరోజు విక్రయించేందుకు (BTST - Buy Today Sell Tomorrow) అనుమతి లేదు.

అలాగే, నేటి ట్రేడింగ్‌లో వచ్చే లాభాలు, అమ్మకాల సొమ్మును వెంటనే ఉపయోగించుకోవడానికి వీలుండదు. ఇవన్నీ సోమవారం సెటిల్ చేయబడతాయి. టీ+0 (T+0) సెటిల్‌మెంట్ సౌకర్యం కూడా నేడు అందుబాటులో లేదు. బడ్జెట్ ప్రకటనల సమయంలో మార్కెట్ మరింత అస్థిరతకు లోనయ్యే అవకాశం ఉన్నందున, రిటైల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More..

BUDGET 2026-2027: నేడే కేంద్ర బడ్జెట్.. ఈ రోజు స్టాక్ మార్కెట్‌లు తెరిచి ఉంటాయా?

Next Story