BUDGET 2026-2027: నేడే కేంద్ర బడ్జెట్.. ఈ రోజు స్టాక్ మార్కెట్‌లు తెరిచి ఉంటాయా?

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-01 02:58:30  IST  )

నేడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు.

BUDGET 2026-2027: నేడే కేంద్ర బడ్జెట్.. ఈ రోజు స్టాక్ మార్కెట్‌లు తెరిచి ఉంటాయా?
X

దిశ‌, వెబ్ డెస్క్: నేడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇది నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న తొమ్మిదవ బడ్జెట్ కాగా స్వాతంత్య్రం వచ్చిన తరవాత దేశంలో ప్రవేశపెట్టబోతున్న 88వ బడ్జెట్ కావడం విశేషం. అయితే ఈ రోజు ఆదివారం కావడం, బడ్జెట్ నేడే ప్రవేశపెడుతుండటంతో స్టాక్ మార్కెట్ తెరిచి ఉంటుందా లేదా అన్న అనుమానాలు చాలా మందిలో నెలకొన్నాయి.

అయితే ఆదివారం అయినప్పటికీ నేడు స్టాక్ మార్కెట్ తెరిచే ఉంటుంది. ఈక్విటీ మరియు కమోడిటీ మార్కెట్లలో రెగ్యులర్ ట్రేడింగ్ తెరిచి ఉంటుంది. పెట్టుబడి దారులు బడ్జెట్ ప్రకటనలకు వెంటనే స్పందించడానికి వీలు కల్పిస్తుంది. NSE, BSE రెండూ పూర్తి ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తాయి. ప్రతిరోజు మాదిరిగానే ఈ రోజు కూడా స్టాక్ మార్కెట్ సమయాలు ఉండనున్నాయి. ఈ రోజు ప్రీ ఓపెన్ సెషన్ ఉదయం 9గంటల నుండి 9.08 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం 9.15 నుండి మధ్యాహ్నం 3.30 వరకు సాధారణ ట్రేడింగ్ జరుగుతుంది. అనంతరం ట్రేడ్ మోడిఫికేషన్ విండో సాయంత్రం 4.15 వరకు తెరిచి ఉంటుంది.

Read More..

Union Budget 2026-2027: నేటి బడ్జెట్లో కీలక మార్పు

Next Story