- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారత్‌గ్యాస్ లైట్ జిప్' ప్రీమియం సేవలు ప్రారంభం!
ఎల్పీజీ వినియోగదారులకు సరికొత్త వంటగ్యాస్ అనుభూతిని అందించేందుకు 'భారత్‌గ్యాస్ లైట్ జిప్' (Bharatgas Lite ZIP) పేరుతో నెక్స్ట్ జనరేషన్ ప్రీమియం ఎల్పీజీ సేవలను ముంబై వేదికగా ప్రారంభించింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) కీలక ముందడుగు వేసింది. తమ వినియోగదారులకు సరికొత్త వంటగ్యాస్ అనుభూతిని అందించేందుకు 'భారత్‌గ్యాస్ లైట్ జిప్' (Bharatgas Lite ZIP) పేరుతో నెక్స్ట్ జనరేషన్ ప్రీమియం ఎల్పీజీ సేవలను ముంబై వేదికగా ప్రారంభించింది. బీపీసీఎల్ చైర్మన్ సంజయ్ ఖన్నా, మార్కెటింగ్ డైరెక్టర్ శుభాంకర్ సేన్ సమక్షంలో ప్రారంభమైన ఈ సరికొత్త విధానంలో.. అత్యంత తక్కువ డాక్యుమెంటేషన్‌తో తక్షణ కొత్త కనెక్షన్ (Instant Connection), చాలా వేగంగా సిలిండర్ ఇంటికి చేరేలా ఎక్స్‌ప్రెస్ డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఆధునిక జీవనశైలికి అనుగుణంగా, తక్కువ సమయంలో గ్యాస్ కనెక్షన్ పొందాలనుకునే వినియోగదారుల కోసం ఈ ప్రీమియం సేవలను డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ సరికొత్త సేవలో భాగంగా అందించే 'భారత్‌గ్యాస్ లైట్' కాంపోజిట్ సిలిండర్ సాధారణ ఇనుప సిలిండర్ల కంటే 50 శాతం తక్కువ బరువు ఉండటం వల్ల సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. దీని బాడీ పారదర్శకంగా ఉండటం వల్ల సిలిండర్‌లో ఇంకా ఎంత గ్యాస్ మిగిలి ఉందో బయట నుంచి స్పష్టంగా చూసుకునే వీలుంటుంది. అలాగే ఇది తుప్పు పట్టని (Corrosion-free), పేలుడు నిరోధక సాంకేతికతతో మరింత సురక్షితంగా రూపొందించబడింది. ప్రస్తుతం ముంబైలో ప్రారంభమైన ఈ సేవలను ఆగస్టు 15 నాటికి దేశంలోని 24 రాష్ట్రాల్లో గల మరో 100 ప్రధాన నగరాలకు వేగంగా విస్తరించాలని బీపీసీఎల్ ప్రణాళికలు సిద్ధం చేసింది.






