- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మార్ట్‌ఫోన్‌లో అధిక చాటింగ్.. Texting Thumb సమస్యకు దారితీస్తుందా?
ఫోన్‌లో ఎక్కువసేపు టైప్ చేయడం, స్క్రోల్ చేయడం అనేది పలువురిలో బొటన వేలు నొప్పికి దారితీస్తున్నది.

దిశ, ఫీచర్స్ : అది ఏ విషయంలోనైనా సరే అతి చేయడం మంచిది కాదంటారు పెద్దలు. అతినిద్ర, అతి ఆలోచన, అతిగా తినడం, అతిగా వాగడం.. ఇలా ప్రతీది ఆరోగ్యానికి హానికరమేనని చెబుతారు. స్మార్ట్‌పోన్‌లో అతి టెక్ట్సింగ్ కూడా అలాంటిదే అంటున్నారు నిపుణులు. అయితే ఇటీవల యువతీ యువకుల్లో, కొందరు పెద్దల్లో ఇది పెరిగిపోతుండటంతో కొందరిలో బొనటవేలు నొప్పికి సైతం దారితీస్తున్నది. దీనినే Texting Thumb అని పిలుస్తున్నారు. దీనివల్ల నష్టాలేమిటి? ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్‌లో ఎక్కువసేపు టైప్ చేయడం, స్క్రోల్ చేయడంవల్ల బొటన వేలు నొప్పి (Thumb pain) నొప్పి, వాపు వంటి సమస్యలకు దారితీస్తున్నది. దీనిని “Texting Thumb” అని పిలుస్తున్నారు. దీర్ఘకాలం ఫోన్ వాడకం వల్ల బొనవేలు భాగంలోని స్నాయువులు (Tendons), కీళ్లు ఒత్తిడికి గురవడంవల్ల ఈ సమస్య తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రమంగా ఇది కార్పల్ టనల్ సిండ్రోమ్, థంబ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి నొప్పి వచ్చినప్పుడు వెంటనే టెక్స్టింగ్ తగ్గించడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
థంబ్ పెయిన్ రాకుండా..
టెక్స్టింగ్ థంబ్ సమస్య నుంచి బయటపడాలంటే.. ప్రతీ 20-30 నిమిషాలకొకసారి ఫోన్ పక్కన పెట్టి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. అలాగే బొటన వేళ్లను మెల్లగా వంకరగా వంచి, నిఠారుగా చేసి స్ట్రెచింగ్ చేయాలి. అలాగే వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్ వాడటం వల్ల టైప్ చేసే సమయం తగ్గడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఫోన్‌ను రెండు చేతులతో పట్టుకొని, బొటన వేలుకు బదులు ఇండెక్స్ ఫింగర్ (చూపుడు వేలు)తో స్క్రోల్ చేయడం మంచిదని చెబుతున్నారు. ఫోన్‌ను ముఖం ఎదురుగా పట్టుకొని, తల వంచకుండా చూడటం కూడా మంచి అలవాటుగా పేర్కొంటున్నారు.
నివారణ చర్యలు..
ఫోన్ కేసులు లేదా పాప్ సాకెట్స్ వాడటం వల్ల గ్రిప్ మెరుగుపడుతుంది. దీంతో టెక్ట్సింగ్ థంబ్ సమస్య రాకుండా ఉంటుంది. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు రాత్రి పడుకునే ముందు బొటన వేలుకు వేడి నీటి కంప్రెస్ ఇవ్వవచ్చు. నొప్పి తీవ్రంగా ఉంటే ఫిజియోథెరపీ లేదా డాక్టర్ సలహా తీసుకోవాలి. చిన్న చిన్న మార్పులతోనే దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చు. ప్రధానంగా ఫోన్‌ను తెలివిగా వాడుతూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.






