- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిఫా ఫైనల్ మ్యాచ్..రేపు స్కూల్స్, కాలేజీలకు సెలవు !
ఫిఫా ఫైనల్ మ్యాచ్ ఉన్న తరుణంలో రేపు స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 తర్వాత ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. క్రీడాలను ప్రేమించే విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేరళ మంత్రి శంశుద్దిన్ వెల్లడించారు.
ఇక కేరళ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో క్రీడా ప్రియులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సరిగ్గా రేపు ఉదయం 12:30 AMకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో స్పెయిన్, అర్జెంటీనా తలపడనున్నాయి. షూట్ ఔట్ వరకు వెళ్తే మార్నింగ్ వరకు ఈ మ్యాచ్ కొనసాగనుంది. అయితే రాత్రంతా విద్యార్థులు మేల్కొని.. పొద్దున స్కూళ్లకు రావడం ఇబ్బందిగా మారనుంది. ఈ క్రమంలోనే హాలిడే ప్రకటించింది కేరళ సర్కార్.






