నీట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

by Kodari Anjali |

అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభినందించారు.

నీట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
X

దిశ, బీర్ పూర్: ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు బీర్పూర్‌కు చెందిన మామిడిపల్లి రిశ్వంత్, నరసింహులపల్లికి చెందిన కొత్తపల్లి జాహ్నవి లను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ విజయం విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వానికి నిదర్శనం అని వైద్య విద్య ద్వారా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని అన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో శ్రమిస్తే విజయాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ కుటుంబానికి, జగిత్యాల జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజగోపాల్, సర్పంచులు హరీష్, సుశీన్, మండల సర్పంచులు, మారుతి, తోట శ్రీనివాస్, రాజకుమార్, శేఖర్, రాంచంద్రం, లక్ష్మణ్, తిరుపతి, సతీష్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story