- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి రైతుల పట్ల రాక్షసుడిగా మారారు: హరీశ్ రావు
by Prasad Jukanti |
గోదావరిలో వరద పోతుంటే నీళ్లు ఎత్తిపోయట్లేదని ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల రాక్షసుడిగా మారిపోయారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గోదావరిలో వరద పోతుంటే నీళ్లు ఎత్తిపోయట్లేదని, రేవంత్ రెడ్డి వచ్చి మళ్లీ పాతరోజులు తీసుకువచ్చారన్నారు. అనంతగిరి నుండి రంగనాయక సాగర్ వరకు రైతులు చేపట్టిన రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధిపేటలో మాట్లాడిన ఆయన.. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయమంటే భద్రాచలం మునుగుతుందని అంటున్నారని మండిపడ్డారు. రైతుబంధు బంద్ అయింది. సాగుకు కరెంట్ ఇవ్వట్లేదు. యూరియా లేదు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేదని దుయ్యబట్టారు. మున్ముందు మరింత కరువు వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
Next Story






