- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారదర్శకంగా ఔట్‌సోర్సింగ్ పరీక్ష.. పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్‌డీసీ) యూనిట్-1, యూనిట్-2 పరిధిలోని వివిధ ఖాళీ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన ఔట్‌సోర్సింగ్ వ్రాత పరీక్ష ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ముగిసింది.

దిశ, జనగామ : జనగామ జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్‌డీసీ) యూనిట్-1, యూనిట్-2 పరిధిలోని వివిధ ఖాళీ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన ఔట్‌సోర్సింగ్ వ్రాత పరీక్ష ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ముగిసింది. కలెక్టరేట్‌లో జరిగిన పరీక్ష నిర్వహణను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్ షాలోంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పూర్తిస్థాయి పారదర్శకతతో పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
పరీక్ష ప్రారంభానికి ముందు అభ్యర్థులు, ఇన్విజిలేటర్లకు నిబంధనలు, విధివిధానాల పై సూచనలు చేశారు. రెండు గంటల పాటు నిర్వహించిన పరీక్షలో ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకుని సమాధానాలు రాయాలని అభ్యర్థులకు సూచించారు. ఎస్‌డీసీ యూనిట్-1, యూనిట్-2లోని డేటా ఎంట్రీ ఆపరేటర్, చైన్‌మెన్, స్వీపర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి మొత్తం 615 మంది దరఖాస్తు చేయగా, 446 మంది పరీక్షకు హాజరయ్యారు. 169 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష నిర్వహణ మొత్తం జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో సాగింది. జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆర్. కుమారస్వామి, జీసీడీఓ గౌషియా బేగంతో పాటు విద్యాశాఖ సిబ్బంది పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు.






