Union Budget 2026-2027: నేటి బడ్జెట్లో కీలక మార్పు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-01 02:34:43  IST  )

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఈసారి ఒక కీలక మార్పుతో రానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Union Budget 2026-2027: నేటి బడ్జెట్లో కీలక మార్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఈసారి ఒక కీలక మార్పుతో రానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు బడ్జెట్ ప్రసంగాల్లో ప్రధానంగా పార్ట్-ఏకే ఎక్కువ ప్రాధాన్యం దక్కేది. ఆర్థిక పరిస్థితుల సమీక్ష, విధాన దిశ వంటివన్నీ ఎక్కువగా పార్ట్-ఏలోనే ఉండేవి. పార్ట్-బీ మాత్రం సాధారణంగా పన్ను ప్రతిపాదనలు, సాంకేతిక అంశాలకే పరిమితమై, తక్కువ సమయంలో ముగిసేది. అయితే బడ్జెట్ 2026-27లో ఈ సంప్రదాయానికి భిన్నంగా పార్ట్-బీనే ప్రధాన వేదికగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈసారి నిర్మలా సీతారామన్ పార్ట్- బీలో అసాధారణంగా ఎక్కువ సమయం కేటాయించి, తక్షణ విధాన చర్యల తోపాటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా వివరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

స్పష్టమైన రోడ్ మ్యాప్...

భారత్ 21వ శతాబ్దంలో మరింత లోతుగా అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశ ప్రాధాన్యాలు ఏంటి? దేశీయ బలాలను ఎలా ఉపయోగించుకోవాలి? గ్లోబల్ వేదికపై ఆర్థికంగా మరింత పోటీతత్వాన్ని ఎలా పెంచుకోవాలి? అనే అంశాలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ను ఈ భాగం ప్రతిబింబించనుందని తెలుస్తోంది. తయారీ రంగం, వాణిజ్యం, ఎగుమతుల విషయంలో ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న సామర్థ్యాలు, భవిష్యత్తులో ఉన్న అవకాశాలను బడ్జెట్ ప్రసంగం ప్రతిబించించనుందని, దీనిపై దేశీ యంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆర్థిక నిపుణులు, విధాన విశ్లేషకులు ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని వర్గాలు పేర్కొన్నాయి. బడ్జెట్ 2026–27ను ప్రభుత్వం అంతర్గతంగా 'రిఫార్మ్ ఎక్స్ప్రెస్'గా అభివర్ణిస్తుండటమే ఈ మార్పు దిశను సూచిస్తోంది.

Read More..

నేడే కేంద్ర బడ్జెట్.. బడ్జెట్ బ్రీఫ్‌కేస్ ఎందుకు రెడ్ కలర్ లో ఉంటుంది?

Next Story