VIRAL: రాష్ట్రంలో వింత ఆచారం.. వర్షాలు కురవాలని గాడిదల పెళ్లి (వీడియో)

by Kema Shiva Kumar |

వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్థులు వినూత్నంగా గాడిదలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

VIRAL: రాష్ట్రంలో వింత ఆచారం.. వర్షాలు కురవాలని గాడిదల పెళ్లి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఎల్ నినో (El Nino) ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే విస్తారంగా వర్షాలు కరిసేందుకు దేవుళ్లకు పూజలు చేయడం ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలను సైతం ఫాలో అవుతున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ (Rayalaseema) ప్రాంతంలో కరువు జిల్లాగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో వినూత్న సాంప్రదాయానికి తెరలేపారు. కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ రెండు గాడిదలకు గ్రామస్థులంతా కలిసి శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు.

ముందుగా వధూవరులుగా మార్చిన రెండు గాడిదలను చక్కగా అలంకరించి, డప్పుల మోతల నడుమ గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాల సాక్షిగా గాడిదకు మంగళసూత్రం కట్టి, తలంబ్రాలు పోసి, హారతులు ఇచ్చి పెళ్లి తంతును పూర్తి చేశారు. వివాహం ముగిసిన తర్వాత ఆ జంటపై నీళ్లు చల్లి వర్షాలు పడాలని ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, గతంలో కూడా గ్రామంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు.. ఇలానే గాడిదలకు పెళ్లి చేయడం వల్ల వరుణ దేవుడు భారీ వర్షాలు కురిపించాడని, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కుర్లపల్లి గ్రామస్థులు విశ్వసిస్తున్నారు.

Next Story