వాషింగ్టన్ సుందర్‌కు గాయం.. టీమిండియా వన్డే జట్టులోకి హర్ష్ దుబే

by Malleboina Mahesh |

ఇంగ్లాండ్‌తో మూడో వన్డేకు భారత జట్టులో మార్పు; వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్ష్ దూబే ఎంపిక.

వాషింగ్టన్ సుందర్‌కు గాయం.. టీమిండియా వన్డే జట్టులోకి హర్ష్ దుబే
X

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్, భారత్ వన్డే సిరీస్ లో భాగంగా ఈ రోజు అత్యంత కీలకమైన మూడో మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో గాయం కారణంగా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరం అయ్యాడు. దీంతో అతని స్థానంలో హర్ష్ దుబేను జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో మ్యాచ్ కోసంహర్ష్ దూబేను భారత జట్టులోకి తీసుకున్నట్లు సెలక్షన్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కుడి హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆయనను రీప్లేస్‌మెంట్‌గా హర్ష్ దుబేను జట్టులోకి తీసుకున్నారు. గాయం తీవ్రత దృష్ట్యా వాషింగ్టన్ సుందర్ ఈ వన్డే సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌‌కు పూర్తిగా దూరమయ్యారు. తదుపరి చికిత్స నిమిత్తం ఆయన స్కానింగ్ పరీక్షలు చేయించుకుని, నిపుణులైన వైద్యుల సలహా తీసుకోనున్నారు.

మూడో వన్డే కోసం అప్‌డేట్ చేసిన భారత జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే.

Next Story