- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడే కేంద్ర బడ్జెట్.. బడ్జెట్ బ్రీఫ్‌కేస్ ఎందుకు రెడ్ కలర్ లో ఉంటుంది?
ప్రతి బడ్జెట్ కు కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ మంత్రి ఎర్రటి రంగులో ఉండే బ్యాగు తీసుకువస్తూ ఉంటారు.

దిశ, వెబ్ డెస్క్: దేశ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో బడ్జెట్ సమావేశ పెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒడిదొడుకులు, నెలకొన్న ప్రస్తుత తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయంట. త్వరలో ఎలక్షన్స్ జరగబోయే ఐదు రాష్ట్రాలకు ఈ బడ్జెట్ లో ఎక్కువ కేటాయింపులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
ఎర్రటి బ్యాగు వెనుక స్టోరీ ఏంటి ?
ప్రతి బడ్జెట్ కు కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ మంత్రి ఎర్రటి రంగులో ఉండే బ్యాగు తీసుకువస్తూ ఉంటారు. దీని వెనుక ఆసక్తికర స్టోరీ కూడా ఉంది. బ్రిటిష్ పాలన ప్రభావం కారణంగా ఇలా మన ఇండియాలో బడ్జెట్ ప్రవేశ పెట్టేటప్పుడు ఎర్రటి బ్యాగు వాడుతూ ఉంటారు ఆర్థిక శాఖ మంత్రులు. 1860 నుంచి ఇదే సంస్కృతి కొనసాగుతోంది. బ్రిటన్ ప్రభుత్వ చట్టపరమైన, ఆర్థిక పత్రాలను మొదటి నుంచి ఎర్ర రంగు కవర్స్ లో భద్రంగా ఉంచుతున్నారు. బ్రిటన్ లో అసలు ఎర్ర రంగు అంటే అధికారం, బాధ్యత, కీలక పదవి అని అర్థం. దీంతో ఈ విధానాన్ని మన ఇండియాలో కూడా అప్పటి బ్రిటిష్ సర్కార్ అమలు చేసింది. అందుకే ప్రతి బడ్జెట్ సమయంలో ఎర్ర రంగు బ్యాగ్ వాడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నిర్మల సీతారామన్ అరుదైన రికార్డు సొంతం చేసుకోబోతున్నారు. ఒకే ప్రధానమంత్రి హయాంలో వరుసగా తొమ్మిదో సారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.






