కొండగట్టు ఆంజనేయుని సన్నిధిలో మాజీ ఎన్నికల కమిషనర్ పార్థసారథి

by Kodari Anjali |

తెలంగాణ మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి. పార్థసారథి కుటుంబ సమేతంగా ఆదివారం రోజున కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు.

కొండగట్టు ఆంజనేయుని సన్నిధిలో మాజీ ఎన్నికల కమిషనర్ పార్థసారథి
X

దిశ, కొండగట్టు: తెలంగాణ మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి. పార్థసారథి కుటుంబ సమేతంగా ఆదివారం రోజున కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి అనుగ్రహం కోరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోత్రనామాలతో వేదోక్తంగా పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. దేవస్థానం ఈవో ఎస్. అంజనారెడ్డి పార్థసారథిని శాలువాతో సత్కరించారు. దర్శనం అనంతరం మాట్లాడిన పార్థసారథి, తెలంగాణ ప్రజలందరికీ మంచి జరగాలని, ముఖ్యంగా రైతులకు శుభం కలగాలని ఆంజనేయస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. “మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలి” అని ఆకాంక్షించారు. వ్యవసాయ శాఖ సూచనలను అనుసరించి రైతులు సాగు పనులు చేపట్టాలని సూచించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రోజులను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో హరిహరనాథ్, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story