కాచిగూడ–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు

by Kodari Anjali |

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటన లో తెలిపారు.

కాచిగూడ–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు
X

దిశ, సికింద్రాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటన లో తెలిపారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 07787 కాచిగూడ–తిరుచానూరు ప్రత్యేక రైలు ఈ నెల 23 (గురువారం)న ఒక్క ట్రిప్ నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో 07788 తిరుచానూరు–కాచిగూడ ప్రత్యేక రైలు ఈ నెల 24 (శుక్రవారం)న ఒక్క ట్రిప్ నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఇరు దిశల్లో ఆగుతాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లలో ఏసీ-2 టైర్, ఏసీ-3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Next Story