'రాకా' కోసం దీపిక డెడికేషన్ నెక్స్ట్ లెవల్

by Pulgam srinivas |   (  Updated:2026-07-19 10:58:49  IST  )

ఏడు నెలల గర్భంతోనూ 'రాకా' సినిమా దీపికా యాక్షన్ సన్నివేశాలలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది.

రాకా కోసం దీపిక డెడికేషన్ నెక్స్ట్ లెవల్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభమైన కొద్ది రోజులకే దీపిక గర్భవతి అయ్యారనే వార్తలు రావడంతో, ఆమె ఈ చిత్రంలో కొనసాగుతారా? లేక తప్పుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ వార్తలకు తెరదించుతూ దీపిక ఈ సినిమా చిత్రీకరణలో కొనసాగుతున్నారు. ఈ చిత్రంలో దీపికపై భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో వాటిని చిత్రబృందం ఎలా తెరకెక్కిస్తుందనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దీపిక ఏడు నెలల గర్భంతో ఉన్నప్పటికీ, ఆమె యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఆమె భద్రత కోసం చిత్రబృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసి, షూటింగ్‌ను శరవేగంగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఆమెకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ఏడు నెలల గర్భంతోనూ సినిమా కోసం అంకితభావంతో పనిచేస్తున్న దీపికను పలువురు ప్రశంసిస్తున్నారు.

అల్లు అర్జున్ లైనప్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అసలు ప్లాన్ అదేనా?

Next Story