అల్లు అర్జున్ లైనప్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అసలు ప్లాన్ అదేనా?

by Pulgam srinivas |   (  Updated:2026-07-19 10:57:43  IST  )

'రాకా' చిత్రం తర్వాత అల్లు అర్జున్, లోకేష్ కనకరాజు, బసిల్ జోసెఫ్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు చేయనున్నాడు.

అల్లు అర్జున్ లైనప్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అసలు ప్లాన్ అదేనా?
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. దీంతో ఆయన వరుసగా పాన్ ఇండియా చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా తర్వాత కూడా అల్లు అర్జున్ భారీ ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన ముగ్గురు దర్శకులతో సినిమాలకు కమిట్ అయినట్లు సమాచారం. 'రాకా' చిత్రీకరణ పూర్తయ్యాక, లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుండగా, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది. అనంతరం బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో భారీ చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తూనే, మరో మూడు భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టిన అల్లు అర్జున్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ముఖ్యంగా ఆయన కమిట్ అయిన చిత్రాల్లో రెండింటికి ఇతర భాషల దర్శకులు దర్శకత్వం వహించనున్న నేపథ్యంలో, తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా మరింత క్రేజ్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నట్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇన్నేళ్లయినా 'ఆర్ఆర్ఆర్' రికార్డు పదిలం.. నెక్స్ట్ ప్లేస్‌లో 'ధురందర్'

Next Story