- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్నేళ్లయినా 'ఆర్ఆర్ఆర్' రికార్డు పదిలం.. నెక్స్ట్ ప్లేస్‌లో 'ధురందర్'
నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ మొదటి స్థానంలో కొనసాగుతుంది.

దిశ, వెబ్ డెస్క్: సినీ పరిశ్రమలో కొన్ని చిత్రాలు విడుదలై అద్భుతమైన రికార్డులను సృష్టిస్తుంటాయి. కాలక్రమేణా వాటిలో కొన్ని రికార్డులు ఇతర సినిమాల పేరిట నమోదవుతుంటే, మరికొన్ని మాత్రం ఎన్నేళ్లు గడిచినా చెక్కుచెదరకుండా నిలిచి ఉంటాయి. అలాంటి అరుదైన రికార్డుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా పేరట కూడా ఓ రికార్డ్ ఉంది. 2022లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1,300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయాన్ని అందుకుంది. అనంతరం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది.
దీంతో 46.2 మిలియన్ వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఎన్నో భారతీయ సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పటికీ, ఇప్పటివరకు ఏ చిత్రం కూడా ఆర్ఆర్ఆర్ రికార్డును అధిగమించలేకపోయింది. ఇటీవల ధురందర్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన తర్వాత ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు కనిపించాయి. అయితే ప్రస్తుతం ఆ చిత్రం 38.6 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించి, ఆర్ఆర్ఆర్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది.






