- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వారణాసి' లేటెస్ట్ షూటింగ్ అప్‌డేట్.. రెండు రోజుల రిహార్సల్స్ తర్వాత షూటింగ్ ప్రారంభం
వారణాసి మూవీకి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న భారీ చిత్రం 'వారణాసి'. ఈ చిత్రానికి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన చిన్న అప్‌డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీస్తోంది. అందుకు ప్రధాన కారణం రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటం, మహేష్ బాబు హీరోగా నటిస్తుండటమే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో లేటెస్ట్ షూటింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం, నిన్న ఈ మూవీకి సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ ప్రారంభానికి ముందు ఒకటి, రెండు రోజుల పాటు ప్రత్యేక రిహార్సల్స్ కూడా నిర్వహించినట్లు సమాచారం. పక్కా ప్రణాళికతో ఈ షెడ్యూల్‌ను మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబుతో పాటు పలువురు కీలక నటీనటులు పాల్గొననున్నట్లు సమాచారం. ఇందులో చిత్రీకరించే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని చిత్రబృందం భావిస్తోంది. ఈ చిత్రంలో స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.






