- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భీంపూర్ మండలంలో 100 శాతం SIR ప్రక్రియ పూర్తి
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ 100 శాతం పూర్తయిందని తహసీల్దార్ బాణావత్ రమేష్ నాయక్ తెలిపారు.

దిశ, భీంపూర్, జులై 19 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ 100 శాతం పూర్తయిందని తహసీల్దార్ బాణావత్ రమేష్ నాయక్ తెలిపారు. మండలంలోని మొత్తం 28 బూత్‌లలో 19,579 మంది ఓటర్లు ఉండగా, అందరి వివరాల డిజిటలైజేషన్ పూర్తి చేశామన్నారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO), బూత్ లెవెల్ ఏజెంట్లను (BLA) ఆయన అభినందించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరంద్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో బీఎల్వో, బీఎల్ఎ, సర్పంచులు, కార్యదర్శులు, జీవోపీలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎంపీడీవో సహకారంతో డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలోనే SIR ప్రక్రియలో 100% డిజిటలైజేషన్ పూర్తి చేసుకున్న మొదటి మండలంగా భీంపూర్ గుర్తింపు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.






