లివర్ ఫెయిల్యూర్.. సంకేతాలు ఇవే..

by Sujitha Rachapalli |

కాలేయం.. డీటాక్సిఫికేషన్, పైత్తం ఉత్పత్తి, పోషకాల నిల్వ, మెటబాలిజం నియంత్రణ వంటి 500కి పైగా ముఖ్యమైన విధులు చేస్తుంది. అయితే కొన్నిసార్లు లివర్ సరిగ్గా పనిచేయకపోవడం జరుగుతుంది.

లివర్ ఫెయిల్యూర్.. సంకేతాలు ఇవే..
X

దిశ, ఫీచర్స్ : కాలేయం.. డీటాక్సిఫికేషన్, పైత్తం ఉత్పత్తి, పోషకాల నిల్వ, మెటబాలిజం నియంత్రణ వంటి 500కి పైగా ముఖ్యమైన విధులు చేస్తుంది. అయితే కొన్నిసార్లు లివర్ సరిగ్గా పనిచేయకపోవడం జరుగుతుంది. ఈ వ్యాధి నిశ్శబ్దంగా డెవలప్ అవుతుంది. అయితే ఆరంభ సంకేతాలను గుర్తించడం ద్వారా చికిత్స ద్వారా ప్రయోజనం పొందవచ్చు. శాశ్వత డ్యామేజ్‌ను అడ్డుకోవచ్చు. కాగా లివర్ చెడిపోయినప్పుడు.. ఈ ఎనిమిది లక్షణాలను కనిపిస్తాయని.. వాటిని విస్మరించకూడదని సూచిస్తున్నారు నిపుణులు.

1. డార్క్ యూరిన్

లివర్ లేదా బైల్ డక్ట్ సమస్యల వల్ల పైత్తం సరిగా ప్రవహించకపోవడం వల్ల మూత్రం చీకటిగా, మలం బూడిద లేదా పాలిపోయి కనిపిస్తాయి. జాండీస్‌తో కలిసి ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.

2. మెమొరీ సమస్యలు

లివర్ సరిగా పని చేయకపోవడం వల్ల మెదడులో టాక్సిన్స్ పేరుకుపోయి హెపాటిక్ ఎన్సెఫలోపతీ వస్తుంది. దీనివల్ల ఏకాగ్రత తగ్గడం, మరచిపోవడం, వ్యక్తిత్వ మార్పులు వస్తాయి. ఇది అత్యవసర వైద్య సహాయం అవసరమైన పరిస్థితి.

3. నిరంతర దురద

రాష్ లేకుండా దురద రావడం బైల్ సాల్ట్స్ చర్మం క్రింద పేరుకుపోవడం వల్ల వస్తుంది. దీర్ఘకాలిక లివర్ వ్యాధుల్లో ఇది సాధారణం.

4. ఆకలి తగ్గడం

లివర్.. ఫ్యాట్స్ ప్రాసెస్ చేయడం, మెటబాలిజం నియంత్రించడంలో సమస్యలు ఏర్పడితే ఆకలి తగ్గి, వాంతులు, బరువు తగ్గడం జరుగుతాయి.

5. సులభంగా గాయాలు, రక్తస్రావం

కాలేయం రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది దెబ్బతిన్నప్పుడు గాయాలు, కట్స్ నుంచి రక్తస్రావం ఎక్కువసేపు ఆగదు.

6. నిరంతర అలసట

రాత్రి పూర్తి నిద్రపోయినా చాలా అలసటగా ఉండటం లివర్ సమస్య సంకేతం. టాక్సిన్స్ తొలగించడం.. పోషకాల జీర్ణక్రియలో లివర్ ఎక్కువగా పని చేయడం వల్ల ఇంధన స్థాయిలు తగ్గుతాయి.

7. పొట్ట లేదా కాళ్లలో వాపు

డ్యామేజ్ అయిన లివర్ అల్బుమిన్ వంటి ప్రోటీన్లను తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ద్రవం పొట్టలో లేదా కాళ్లలో పేరుకుపోయి వాపు వస్తుంది.

8. జాండీస్

కాలేయం సరిగ్గా పని చేయకపోవడం వల్ల బిలిరుబిన్ రక్తంలో పేరుకుపోయి చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. ఇది లివర్ వ్యాధి అత్యంత స్పష్టమైన లక్షణం. కాగా అత్యవసర వైద్య సహాయం అవసరం.

Next Story