వ్యక్తిత్వ హననంపై టీడీపీ సీరియస్.. పార్లమెంట్‌లో చర్చకు నిర్ణయం

by Vemula.Srinu Prasad |

వ్యక్తిత్వ హననంపై తెలుగుదేశం పార్టీ సీరియస్ అయింది. ఈ విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది...

వ్యక్తిత్వ హననంపై టీడీపీ సీరియస్.. పార్లమెంట్‌లో చర్చకు నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: వ్యక్తిత్వ హననం(Character assassination)పై తెలుగుదేశం(Telugu Desam) పార్టీ సీరియస్ అయింది. ఈ విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. అంతేకాదు త్వరలో జరగబోయే సమావేశాల్లోనూ చర్చించాలని ఆకాంక్షించింది. ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ(Tdp) ఎంపీలు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయించారు.

ఈమేరకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(MP Lavu Sri Krishna Devarayalu) మాట్లాడుతూ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హనానికి పాల్పకుండా కట్టడి చేయాలన్నారు. ఇందుకోసం మరింత కఠిన చట్టాలు తీసుకురావాలని అఖిలపక్షంలో కోరినట్లు తెలిపారు. సైబర్ నేరాలు, హవాలా, కట్టడిపైనా పార్లమెంట్‌లో చర్చించాలని చెప్పారు. పొగాకు రైతు సమస్యలపై పార్లమెంట్‌లో ప్రస్తావించాలని చెప్పారు. రాయలసీమలో పరిశ్రమలు వస్తుండటంతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అలాగే హార్టి కల్చర్ హబ్ గా రాయలసీమను తయారు చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

Next Story