టాస్ గెలిచిన ఇంగ్లాండ్...బుమ్రా లేకుండానే బ‌రిలోకి

by velandi.Saikiran |

లార్డ్స్ వ‌న్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్...ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది.

టాస్ గెలిచిన ఇంగ్లాండ్...బుమ్రా లేకుండానే బ‌రిలోకి
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇవాళ‌ చిట్ట చివరి వన్డే జరగనుంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ వన్డే మ్యాచ్ నేపథ్యంలో కాసేపటికి క్రితమే టాస్ వేశారు. ఇందులో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్, ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో భారత జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. లార్డ్స్ కండిషన్స్ నేపథ్యంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్లకు అడ్వాంటేజ్ ఉండనుందట. ఈ క్రమంలోనే బ్రూక్ టాస్ గెలిచిన వెంటనే.. బ్యాటింగ్ కు మొగ్గు చూపాడు.

మూడో వన్డే నుంచి బుమ్రా ఔట్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో వన్డే నేపథ్యంలో బుమ్రా దూరమయ్యాడు. గాయం కారణంగా అతన్ని పక్కకు పెట్టారు. అలాగే ఈ మ్యాచ్ లో దూబే, వాషింగ్టన్ సుందర్ లు కూడా ఆడడం లేదు. వీళ్ళ స్థానంలో రాహుల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్ దీప్ బరిలోకి దిగనున్నారు.

భారత జ‌ట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (w), అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ

Next Story