'లెనిన్' సక్సెస్‌తో పారితోషికం భారీగా పెంచేసిన భాగ్యశ్రీ.. ఇప్పుడు అన్ని కోట్లు?

by Pulgam srinivas |

లెనిన్ హిట్ తో భాగ్యశ్రీ తన పారితోషకాన్ని రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్లకి పెంచినట్లు ప్రచారం సాగుతోంది.

లెనిన్ సక్సెస్‌తో పారితోషికం భారీగా పెంచేసిన భాగ్యశ్రీ.. ఇప్పుడు అన్ని కోట్లు?
X

దిశ, వెబ్ డెస్క్: మిస్టర్ బచ్చన్ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, అందులో తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో వరుస అవకాశాలు ఆమెను వరించాయి. అయితే ఆ తర్వాత చేసిన పలు చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఆమెకు నిరాశే ఎదురైంది. అలాంటి సమయంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన లెనిన్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ బోర్సేకు మంచి బ్రేక్ దక్కింది.

జూలై 10న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఇందులో ఆమె నటనకు కూడా ప్రశంసలు లభించాయి. ఈ విజయంతో భాగ్యశ్రీ బోర్సే క్రేజ్ ఒక్కసారిగా పెరిగిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఆమె తన పారితోషకాన్ని కూడా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఒక్కో సినిమాకు సుమారు రూ.1.5 కోట్ల పారితోషకం తీసుకున్న భాగ్యశ్రీ బోర్సే, లెనిన్ విజయం తర్వాత రూ.2.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వార్తలు బయటకు రావడంతో మంచి అందం, నటన ఉన్న హీరోయిన్లకు భారీ విజయాలు దక్కితే పారితోషకాన్ని పెంచడం సహజమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story