- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: బ్యాంకులకు ఆర్‌బీఐ కొత్త నిబంధనలు
ఈ ఆస్తుల నిర్వహణలో బ్యాంకులు తప్పనిసరిగా 'ఎస్ఏఆర్ఎఫ్ఏఈఎస్‌టీ చట్టం, 2002' లోని వేలం నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండి బకాయిల వసూళ్లను వేగవంతం చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సరికొత్త నిబంధనలను తీసుకువచ్చింది. రుణగ్రహీతలు అప్పులు ఎగ్గొట్టినప్పుడు బ్యాంకులు స్వాధీనం చేసుకునే స్థిరాస్తులను, నిబంధనల ప్రకారం గరిష్టంగా ఏడేళ్ల లోపే బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని ఆదేశించింది. ఈ ఆస్తుల నిర్వహణలో బ్యాంకులు తప్పనిసరిగా 'ఎస్ఏఆర్ఎఫ్ఏఈఎస్‌టీ చట్టం, 2002' లోని వేలం నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త పాలసీ ప్రకారం.. బ్యాంకులు తమ సొంత అవసరాలకు వాడుకునే ఆస్తులు మినహా, రికవరీ కోసం జప్తు చేసిన అన్ని ఆస్తులకూ ఈ గడువు వర్తిస్తుంది. ఇప్పటికే సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకుల వద్ద ఉండే పాత ఆస్తులను వదిలించుకోవడానికి 2027, సెప్టెంబర్ 30 వరకు అదనపు గడువు ఇచ్చింది.
ఆస్తి విక్రయాల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఆర్‌బీఐ మరో కీలకమైన నిబంధన పెట్టింది. 'ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్‌సీ కోడ్ (ఐబీసీ)' కింద డిఫాల్టర్లుగా తేలిన రుణగ్రహీతలకు లేదా వారికి సంబంధించిన వ్యక్తులు, సంస్థలకు ఈ జప్తు చేసిన ఆస్తులను తిరిగి విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించింది. ఇకపై ఆస్తి యాజమాన్య హక్కు పూర్తిగా బ్యాంకుకు బదిలీ అయిన తర్వాతే దానిని స్వాధీనంగా పరిగణిస్తారు. అకౌంటింగ్ పారదర్శకత కోసం ఆస్తి అసలు విలువ కంటే మార్కెట్లో దాని ధర పడిపోతే, పడిపోయిన తక్కువ ధరనే బ్యాంకు తన లెక్కల్లో చూపించుకోవాలి. వీటిని సాధారణ స్థూల, నికర ఎన్‌పీఏ లెక్కింపులో చూపించకుండా, బ్యాలెన్స్ షీట్‌లో 'క్లెయిమ్‌ల సంతృప్తి కోసం స్వాధీనం చేసుకున్న బ్యాంకింగేతర ఆస్తులు' అనే ప్రత్యేక శీర్షిక కింద విడిగా వెల్లడించాలని ఆర్‌బీఐ తేల్చి చెప్పింది.






