తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్: విజయం తథ్యమని విజయ్ ఆసక్తికర ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-08 08:48:25  IST  )

తమిళనాడులో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ టీవీకే చీఫ్ విజయ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్: విజయం తథ్యమని విజయ్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamilnadu) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ (Hung Assembly) పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్, నటుడు తలపతి విజయ్ (Vijay) 12వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 12వ తరగతి ఫలితాలు విడుదలైన సందర్భంగా, విజయం సాధించిన విద్యార్థులకు విజయ్ అభినందనలు తెలిపారు. ఆశించిన ఫలితాలు రాని వారు నిరాశ చెందవద్దని, జీవితంలో గెలుపోటములు సహజమని ధైర్యం చెప్పారు.

కష్టపడి పనిచేయడం (Hard work) వల్లే నిజమైన విజయం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే, తన ట్వీట్ చివరలో విజయ్ ‘మంచి జరగబోతోంది.. విజయం తథ్యం!’ (Success is Certain) అని ముగించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు కేవలం విద్యార్థులకే కాకుండా తన రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఓ బలమైన సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.

గవర్నర్ తీరుపై కోర్టుకు విజయ్

బీజేపీ గుప్పిట్లో డీఎంకే, అన్నాడీఎంకే.. తమిళనాడులో బీహార్ సీన్ రిపీట్.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

Next Story